Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామారెడ్డి: జిల్లాలోని మాచారెడ్డి మండలంలో నాటు తుపాకి పేలి ఒకరు మృతి చెందారు. మర్రితండాకు చెందిన బాణోత్ రావోజీ, బానోత్ రాంరెడ్డి, ఆశిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు సిరికొండ మండలం తూమ్పల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో జంతువులను వేటాడుతుండగా తపంచా పేలి రావోజీ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందిన వెంటనే కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.