Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరగాల్సిన మహిళల జాతీయ రెజ్లింగ్ కోచింగ్ క్యాంపును రద్దు చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆ ఈవెంట్ జనవరి 18వ తేదీ నుంచి జరగాల్సి ఉంది. సుమారు 41 మంది రెజ్లర్లు, 13 మంది కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ ఆ క్యాంపులో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
మరో వైపు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు. బ్రిజ్ భూషణ్‌తో పాటు అనేక మంది కోచ్‌లు లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని వినేశ్ ఆరోపించారు. ఈ ఘటన పట్ల కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ స్పందించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య వివరణ ఇవ్వాలని కోరింది. 72 గంటల్లోనే సమాధానం ఇవ్వాలని క్రీడాశాఖ ఆదేశించింది.