Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వ్యాయామం చేస్తూ 67 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని పల్గర్ జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రహ్లాద్ నికమ్ (67) అనే వ్యక్తి రోజూ సాయంత్రం తన ఇంటికి సమీపంలోని జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంటారు. రోజూలాగే బుధవారం సాయంత్రం 7.30గంటల ప్రాంతంలో వ్యాయామం చేస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. జిమ్ నిర్వాహకులు ప్రహ్లాద్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, ప్రహ్లాద్ మృతికిగల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.