Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బీహార్ లోని బక్సర్ జిల్లాలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమాధాన్ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా రైలు పట్టాల మీదుగా రహదారి మార్గంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం ఏకంగా 15 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బక్సర్ స్టేషన్ అవుటర్ సిగ్నల్ వద్ద రెండు రైళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో సీఎం వెళ్లిన తర్వాత వాటికి గ్రీన్ సిగ్నల్ పడింది. విసుగెత్తిన ప్రయాణికులు కొందరు రైలు దిగి నడుచుకుంటూ, వేరే వాహనాలను ఎక్కి తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. దీంతో కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే దీనిపై విమర్శలు గుప్పించారు.