Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మంగపేట : సంక్రాంతి తెల్లారి కనుము నాడు భార్యభర్తల మధ్య జరిగిన గొడవకు మనస్తాపం చెందిన మహిళ చెరుకుల సూరమ్మ(45) గ్రామంలోని చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బాలన్నగూడెంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తరచూ సొమ్మ రోగంతో బాదపడుతున్న సూరమ్మ సంక్రాంతి పండగ సందరంగా రెండు మూడు రోజులుగా మధ్యం సేవిస్తూ మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతుందని ఈ క్రమంలో భర్త లక్ష్మయ్యతో ఇంట్లో గొడవపడి మనస్థాపానికి గురై ఇంట్లో నుండి వెల్లిపోయిందని తెలిపారు. మూడు రోజులుగా సూరమ్మ కోసం భర్త లక్ష్మయ్య కొడుకులు బంధువులు వెతుకున్నా జాడతెలియలేదని గురువారం ఉదయం గ్రామంలోని పెద్ద చెరువు కింద నాట్లు పెట్టడానికి చెరువులో చాపలు పట్టడానికి వెళ్లిన గ్రామస్తులకు చెరువులో మహిళ శవం కనిపించడంతో గ్రామస్తులకు తెలపినట్లు తెలిపారు. మూడు రోజులుగా కనిపించకుండా పోయిన సూరమ్మ భర్త లక్ష్మయ్య పిల్లలు కూడా చెరువు దగ్గరకు వెళ్లి చూడగా సూరమ్మ శవంగా గుర్తించినట్లు తెలిపారు.