Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు. ఈ సందర్భంగా బ్రిజ్ భూషణ్‌తో పాటు అనేక మంది కోచ్‌లు లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని వినేశ్ సంచలన ఆరోపణలు చేశారు. బ్రిజ్ భూషణ్, ఇతర కోచ్‌లు లక్నోలో నిర్వహించే జాతీయ శిక్షణ శిబిరంలో మహిళా రెజ్లర్లను లైంగికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. 10, 12 మంది అమ్మాయిలు తమ గోడును నా ముందు వెళ్లబోసుకున్నారు. వారి పేర్లు ఇప్పుడే చెప్పను. ప్రధాని మోడీని కలిసే అవకాశం కల్పిస్తే ఆయనకే అన్ని వివరాలు చెప్తా. బ్రిజ్ భూషణ్ వేధింపుల కారణంగా నేను ఎంతో మానసిక క్షోభను అనుభవించా. ఆయన నన్ను ఎందుకూ పనికిరావని ఘోరంగా తిట్టారు. ఆయన వల్ల నేను ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నా. ఆయనపై ఫిర్యాదు చేసినందుకు గతంలో నాకు చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి అంటూ మీడియా ఎదుట వినేశ్ ఫొగట్ కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు ఈ ఘటనను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖక సీరియస్‌గా తీసుకుంది. ఘటనపై భారత రెజ్లింగ్ సమాఖ్య వివరణ ఇవ్వాలని కోరింది. 72 గంటల్లోనే సమాధానం ఇవ్వాలని క్రీడాశాఖ ఆదేశించింది.