Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లక్నో
ఉత్తర్ప్రదేశ్ భదోహిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమిస్తున్నాని ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందని 15 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిచంపాడు ఓ కిరతాకుడు. నుదుటిపై షూట్ చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ తరుణంలో నిందుతుడ్ని 22 ఏళ్ల అరవింద్ విశ్వకర్మగా గుర్తించారు పోలీసులు. బాధితురాలి పేరు అనురాధ. ఈమె నిందితుడి సోదరితో పాటు కోచింగ్ సెంటర్కు వెళ్తోంది. ఓ రోజు తిరిగివస్తుండగా అనురాధ దగ్గరకు వెళ్లి అరవింద్ ప్రపోజ్ చేశాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన అరవింద్ గన్ తీసి ఆమెను షూట్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కేసు పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.