Authorization
Fri May 16, 2025 09:22:42 pm
నవతెలంగాణ- హైదరాబాద్
సికింద్రాబాద్ పరిధి నల్లగుట్టలోని ఓ షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. డెక్కన్ నైట్‌వేర్ స్పోర్ట్స్ షోరూంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆరు అంతస్తుల భవనంలో కింద కార్ల విడి భాగాల గోదాం, పైన స్పోర్ట్స్ షోరూం నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో గోదాంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. రాబ
ఆ మంటలు పైఅంతస్తులో ఉన్న షోరూంకు అంటుకోవడంతో భారీగా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. సమీపంలోని దుస్తుల దుకాణంలోనూ పొగలు వచ్చాయి. అందులో చిక్కుకున్న ముగ్గురిని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.