Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జమైకా
|ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పరుగులు వీరుడు, జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఆర్థిక మోసం బారినపడ్డాడు. ఓ ప్రయివేటు పెట్టుబడుల సంస్థలో బోల్డ్‌కు ఉన్న ఖాతా నుంచి ఏకంగా 12.7 మిలియన్ డాలర్లు మాయమయ్యాయి. జమైకా కు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఎస్ఎస్ఎల్) సంస్థలో బోల్ట్ కొన్నేళ్ల కిందట ఓ పెట్టుబడి ఖాతా తెరిచాడు. రిటైర్మెంట్, లైఫ్‌టైం సేవింగ్స్‌లో భాగంగా ఈ ఖాతాను కొనసాగిస్తున్నాడు. దీనిలో అతడికి 12.8 మిలియన్ డాలర్లు ఉండగా జనవరి రెండో వారం నాటికి కేవలం 12000 డాలర్ల బ్యాలెన్స్ మాత్రమే చూపించిందని బోల్ట్ న్యాయవాది తెలిపారు. కంపెనీలో జరిగిన మోసపూరిత చర్య వల్ల డబ్బులు మాయమైనట్లు ఆరోపించారు.
ఈ తరుణంలో ఉసేన్ బోల్ట్ తో సహా దాదాపు 30 మంది ఖాతాదారులు డబ్బులు కోల్పోయినట్లు తెలుస్తుంది. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ తెలిపింది. తమ ఖాతాదారుల ఆస్తులను మరింత భద్రంగా చూసుకొనేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ క్రమంలో ఎస్ఎస్ఎల్ కంపెనీపై చర్యలు చేపట్టారు. కంపెనీ మేనేజ్మెంట్ బాధ్యతలను తాత్కాలికంగా ప్రభుత్వ అధికారులు చేతుల్లోకి తీసుకున్నారు.