Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా దేశ అగ్రశ్రేణి రెజ్లర్లు చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా, సాక్షి మలిక్, సంగీత ఫొగాట్ సహా పలువురు క్రీడాకారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునియా మాట్లాడుతూ.. ‘‘ఈ దేశం కోసం మేం పోరాడుతున్నప్పుడు.. మా హక్కుల కోసం పోరాడుతాం’’ అని తెలిపాడు. బ్రిజ్ భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే వరకు ఈ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశాడు.