Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లామాబాద్
పాకిస్తానీ ఫొటోగ్రాఫర్ ఇంతియాజ్ హుస్సేన్ ఓ చిన్నారి వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్న పాప స్కర్ధు లోయలో ఎముకలు కొరికే చలిలో కట్టెలు సేకరిస్తుండటం కనిపించింది. వీడియోలో కనిపించిన బాలికను జైనాబ్గా గుర్తించారు. రెడ్ టాప్, బ్లాక్ ప్యాంట్స్లో ఈ వీడియోలో బాలిక కనిపించింది. ఆమె భుజాలపై వేలాడుతున్న బాస్కెట్లో కట్టెలను వేస్తూ ముందుకు సాగుతోంది. స్కర్ధు వ్యాలీ నుంచి జైనాబ్ శీతాకాలంలో తన సోదరుడితో కలిసి ఆమె కట్టెలు సేకరిస్తోందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.