Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ లెజెండరీ కమెడియన్ వడివేలు మాతృమూర్తి పాప (87) కన్నుమూశారు. మధురైలోని విరగనూర్ గ్రామంలో నివసిస్తున్న ఆమె కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అస్వస్థతకు గురైన ఆమెను బుధవారం రాత్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్ప పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు కోలీవుడ్ సర్కిల్ సమాచారం. వడివేలు తల్లి అంత్యక్రియలు ఇవాళ జరుగనున్నాయి. వడివేలు తల్లి మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడివేలు కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాడ సంతాపం తెలియజేశారు. వడివేలు గతేడాది నాయ్ శేఖర్ రిటర్న్స్ సినిమాలో మెరిశారు. ప్రస్తుతం మారి సెల్వరాజ్ డైరెక్షన్లో నటిస్తోన్న మామానన్ విడుదల కావాల్సి ఉంది. దీంతోపాటు రాఘవా లారెన్స్ హీరోగా నటిస్తున్న చంద్రముఖి2లో కీ రోల్ చేస్తున్నాడు.