Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట డెక్కన్ స్టోర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న హోంమంత్రి మహమూద్ అలీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటలార్పేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాల వల్లే మంటల ఉధృతి ఎక్కువగా ఉందని, ప్రస్తుతానికి 80శాతం మంటలు తగ్గుముఖం పట్టాయన్నారు. మంటలు మరో గంట వరకు అదుపులోకి వస్తాయని తెలిపారు.
అగ్నిప్రమాదంలో ఎవరూ చనిపోలేదని, ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియడం లేదన్నారు. మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మంటలు తగ్గిన తర్వాత ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. భవిష్యత్తులో ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంలో కాలనీ వాసులు నష్టపోతే ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.