Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
స్విగ్గీలో ప్రస్తుతం 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఇప్పుడున్న ఉద్యోగుల్లో 8 నుంచి 10 శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు మార్కెట్ వర్గాల ద్వారా సమాచారం. ఉత్పాదక, ఇంజినీరింగ్, ఆపరేషన్ విభాగాల ఉద్యోగులే ఈ దఫా తొలగింపు ప్రక్రియలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఓను ప్రారంభించే ముందు కార్యాచరణ లాభదాయకంగా మారేలా లక్ష్యాలు పెట్టుకున్నట్లు స్విగ్గీ ఇదివరకే తెలిపింది. కంపెనీ పనితీరు సమీక్ష 2022 అక్టోబర్లో పూర్తయింది. అనంతరం ఉద్యోగులను పనితీరు మెరుగుదల ప్రణాళిక కింద ఉంచారు. ఈ క్రమంలో మేనేజిమెంట్ టీంలను పునర్వ్యవస్థీకరిస్తున్నందున చాలా మంది ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు.