Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర బీసీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆలోక్‌కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందిన వారిలో 182 మంది గ్రూప్ 1 మెయిన్స్‌కు అర్హత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో మెయిన్స్‌కు కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వరంగల్, ఖమ్మం స్టడీ సర్కిళ్లలో 100 చొప్పున, హైదరాబాద్ స్టడీ సర్కిల్లో 200 మందికి మొత్తంగా 400 మందికి మెయిన్ పరీక్షకు శిక్షణకు ఇవ్వనున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ స్టడి సర్కిళ్లలో శిక్షణ పొంది మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి ప్రియారిటీ ఉంటుందని వెల్లడించారు.
అదేవిధంగా మెయిన్స్‌కు అర్హత సాధించిన ఆసక్తి ఉన్న అభ్యర్థులు సైతం స్టడీ సర్కిళ్లలో దరఖాస్తు చేసుకోవాలని మెరిట్ ఆధారంగా శిక్షణ ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ఉచిత శిక్షణతో పాటు నెలకు రూ.5వేల చొప్పున మూడునెలల పాటు ఉపకారవేతనం సైతం అందివ్వనున్నామని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.