Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధి రాంగోపాల్‌పేటలోని ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో ఇవాళ ఉదయం భారీగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకువుచ్చారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి.. భవనం మొత్తం అంటుకున్నాయి. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లను మోహరించి.. అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అలాగే భవనంలో చిక్కుకుపోయిన ఐదుగురిని కాపాడారు. ఘటనపై రాంగోపాల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి పాపయ్య మాట్లాడుతూ మంటలను ఆర్పేందుకు 22 ఫైర్ ఇంజిన్లను వాడినట్లు వివరించారు. చరిత్రలో తొలిసారిగా 22 ఫైరింజన్లను వినియోగించడం ఇదే తొలిసారి అని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో 90 మంది సిబ్బంది పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం డెక్కన్ స్పోర్ట్స్ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించనున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు భవన పటిష్టతను పరిశీలించనున్న పరిశీలిస్తారు. భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో చుట్టుపక్కల ఇండ్లకు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో అధికారులు భవనానికి సమీపంలో ఉన్న ప్రజలను సైతం అధికారులు శిబిరాలకు తరలించారు. శిబిరాల్లోనే వారికి జీహెచ్ఎంసీ అధికారులు భోజన వసతి కల్పించారు.