Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది అంటే 2022 ఆగస్టులో కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్ మీద కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు కంచన్‌బాగ్ నుంచి మంగళ్‌హాట్ ఠాణాకు బదిలీ అయ్యింది. ఈ క్రమంలో మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజాసింగ్‌కు వచ్చిన నోటీసులపై ఆయన న్యాయవాది కరుణ సాగర్ స్పందించారు. పోలీసులు జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇస్తామని చెప్పారు. ఫేస్బుక్లో ఓ నెటిజన్ పెట్టిన పోస్టు కింద రాజాసింగ్ కామెంట్ పెట్టారు. అయితే, ఆయన చేసిన పెట్టిన కామెంట్ ఓ మతాన్ని కించనపరిచినట్లుగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.