Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: లోహ్రీ పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన లాటరీలో ఓ వృద్ధుడికి జాక్‌పాట్ తగిలింది. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడయ్యాడు. పంజాబ్‌లోని మొహాలీ జిల్లా త్రివేది క్యాంప్ గ్రామంలో మహంత్ ద్వారకాదాస్ అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. లాటరీలంటే అతడికి అమితాసక్తి. తరచూ వాటి టికెట్లు కొని అదృష్టాన్ని పరీక్షించుకునేవాడు. లోహ్రీ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం విక్రయించిన లాటరీ టికెట్‌నూ కొన్నాడు. దీంతో అదృష్టం వరించింది. అతడు ఏకంగా రూ.5 కోట్లు గెల్చుకున్నాడు. మహంత్ కుమారుడు నరేంద్ర ప్రస్తుతం కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.