Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ అక్షరాభ్యాసానికి సిద్ధమవుతున్నారు! వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! అయినా, ఇదే నిజం. ఈ నెల 26న సరస్వతీ పూజను పురస్కరించుకుని మమతా బెనర్జీ సమక్షంలో రాజభవన్లో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం పలక, బలపం పట్టి గవర్నర్ బెంగాలీ అక్షరాలు దిద్దుతారు. ఇంగ్లిష్, హిందీ, మలయాళం భాషల్లో దాదాపు 40 పుస్తకాలు రాసిన ఆనందబోస్ బెంగాలీలోనూ ఓ పుస్తకం రాయాలని యోచిస్తున్నారు. బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే ఆయన తన ఆసక్తిని వెలిబుచ్చారు. ఇందుకోసం బెంగాలీ భాష నేర్చుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా చిన్నారులకు 'హతేఖోరీ' పేరుతో నిర్వహించే సంప్రదాయ అక్షరాభ్యాస తంతును గవర్నర్కు నిర్వహిస్తారు.