Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఏడీఎఫ్ వో ధనుంజయరెడ్డితో పాటు ఫైరింజన్ డ్రైవర్ నర్సింగరావుకు అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం ఏడీఎఫ్ వో, డ్రైవర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. చికిత్స పొందున్న డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్ పై డ్రైవర్ కు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట నల్లగుట్టలోని ఓ షాపింగ్‌మాల్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన ముచ్చట తెలిసిందే.