Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్ధాపకుడు రీడ్ హస్టింగ్స్ కంపెనీ సీఈఓగా వైదొలిగారు. తన స్ధానంలో నూతన సీఈఓగా టెడ్‌ను నియమించారు. గత ఏడాది ముగిసేనాటికి 70 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు పెరిగిన నేపధ్యంలో హస్టింగ్స్ రాజీనామా విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. నెట్‌ఫ్లిక్స్ సీఈఓగా టెడ్‌ను నియమించామని హస్టింగ్స్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. నేటి నుంచి గ్రెగ్ పీటర్స్ సీఓఓ నుంచి టెడ్ కో-సీఈఓగా బాధ్యతలు చేపడతారని చెప్పారు. తాను సీఈఓ పదవి నుంచి వైదొలగి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేస్తానని హస్టింగ్స్ వెల్లడించారు. టెడ్, గ్రెగ్, తానూ 15 ఏండ్లుగా కంపెనీల్లో వివిధ హోదాల్లో కలిసి పనిచేశామని తమలో అత్యుత్తమ నైపుణ్యాలను ఎలా వెలికితీయాలన్నది తాము నేర్చుకున్నామని చెప్పుకొచ్చారు. గ్రెగ్, టెడ్లకు సాయం చేస్తూ మంచి చైర్మన్‌గా కొనసాగుతానని, బోర్డుకు తమ సీఈఓలకు మధ్య వారధిగా పనిచేస్తానని హస్టింగ్స్ పేర్కొన్నారు.