Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1పై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ తరుణంలో దీనిపై శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు.
రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలపై విచారించే పరిధి వెకేషన్ బెంచ్‌కు లేదని కోర్టుకు తెలిపారు. తనకు లేని పరిధిలో వెకేషన్ బెంచ్ తీర్పు చెప్పిందని వాదించారు. ఉదయం 10:30కు కేసును మెన్షన్ చేసి ప్రతివాదుల వాదనలు వినకుండానే అదే రోజున తీర్పు వెల్లడించారని తెలిపింది. ఏపీ ప్రభుత్వ వాదనను తన ఉత్తర్వులలో రికార్డు చేసిన సీజేఐ డీవై చంద్రచూడ్ కేసు మెరిట్స్ లోపలికి వెళ్లడం లేదని తెలిపారు. హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని అన్నారు.