Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హాంకాంగ్‌లో మహిళ ఇంట్లో రూ.30 కోట్ల రూపాయల నల్లధనాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళ అత్యంత రహస్యంగా నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునే సిండికేట్‌ను నడుపుతోందని కనిపెట్టారు. ఈ తరుణంలో ఆమెతో పాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ మహిళతో పాటు మరో ఎనిమిది మంది ఈ వ్యక్తులు నల్లధనాన్ని తెల్లగా మార్చడానికి డజన్ల కొద్దీ బ్యాంకు ఖాతాలను ఉపయోగించారు. ఇప్పటి వరకు దాదాపు 178 బిలియన్ యువాన్లకు పైగా నల్లధనాన్ని వీరు వైట్‌గా మార్చారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రూ.30 కోట్ల నగదుతోపాటు పలు నగదు లెక్కింపు యంత్రాలు, బ్యాంకు కార్డులు, రహస్య పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరు నిర్వహిస్తున్న ఖాతాల ద్వారా జనవరి 2020 నుంచి డిసెంబర్ 2022 మధ్య 7,600 కంటే ఎక్కువ లావాదేవీలు జరిగాయి. ఆయా ఖాతాల ద్వారా 487 బిలియన్ యువాన్లు విదేశాలకు తరలిపోయాయని కస్టమ్స్ అధికారులు తెలిపారు.