Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని షాపింగ్మాల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు షార్ట్ సర్య్కూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో కొద్ది మీటర్ల దూరంలో విద్యుత్ సరఫరా ఉందన్నారు. ఒకవేళ షార్ట్ సర్య్కూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్లో ట్రిప్ అయ్యేదని కానీ అలా జరగలేదని ఆయన వివరించారు.
గురువారం ఉదయం 11.20 గంటలకు సమాచారం అందగానే విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, వైర్లు పూర్తిగా కాలిపోయేవన్నారు. భవనానికి మొత్తం 6 మీటర్లు ఉన్నాయన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలేంటనేది దర్యాప్తులో తేలుతుందని శ్రీధర్ అన్నారు. ఈ తరుణంలో భవనం లోపలి పరిస్థితిని అంచనా వేయడానికి అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు డ్రోన్ ఉపయోగించారు. మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన భవనం యజమాని జావేద్ పరారీలో ఉన్నట్లు సమాచారం.