Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: విలాసాల మనిషిని ఎంతకైనా దిగజారుస్తాయి. అలాంటి ఘటనే తాజాగా గుజరాత్ లో చోటు చేసుకుంది. విలాసాలకు అలవాటు పడిన ఓ మహిళ ఏకంగా తన అండాలను అమ్ముకుంది. విషయం తెలుసుకొని ప్రశ్నించిన భర్తను చంపేస్తానంటూ బెదిరించింది. ఈ ఉదంతం గుజరాత్‌లోని అమ్రైవాడీ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. నిందితురాలు అనితకు ఐదేండ్ల క్రితం వివాహమైంది. తరచూ అత్తమామలతో గొడవపడుతూ.. భర్తపై ఒత్తిడి తెచ్చి వేరు కాపురం పెట్టింది. అయితే భర్త ఆదాయం సరిపోవడం లేదంటూ భర్యాభర్తలకు తరచు గొడవలు జరగడంతో విసుగు చెందిన భర్త.. ఆమెను వదిలి 2019లో తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. తర్వాత సయోధ్య కుదరడంతో కొన్నాళ్లుగా మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. అనిత డబ్బు కోసం అండాలు విక్రయించుకుంటున్న సంగతిని తాజాగా భర్త గుర్తించాడు. ఇందుకోసం అహ్మదాబాద్‌లోని ఓ ఏజెంట్‌తోపాటు తన అత్త ఆమెకు సహకరిస్తున్నట్లు నిర్ధారించుకున్నాడు. ఈ వ్యవహారంపై భార్యను నిలదీశాడు. ఆమె పెద్ద గొడవ చేసింది. విషయం బయటకు చెప్తే చంపేస్తామంటూ బెదిరించింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అండాల విక్రయానికి వీలుగా అనిత ఆధార్ కార్డులో పుట్టినతేదీని మార్చుకుందని అందులో పేర్కొన్నాడు. భర్త అనుమతితోనే వాటిని అమ్ముకుంటున్నట్టు కూడా ఫోర్జరీ పత్రాలు సృష్టించిందని తెలిపాడు. 2019 జనవరి నుంచి 2022 జూన్ మధ్య ఆమె పలుమార్లు అండాలను విక్రయించుకుందని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో పోలీసులు ఫోర్జరీ సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.