Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూయార్క్
ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. కొలువులు కోల్పోయిన అమెరికన్ ఉద్యోగులకు ఇప్పటికే ఈమెయిల్స్ పంపగా ఇతర ప్రాంతాల్లో వేటుకు గురైన వారికి త్వరలోనే లేఆఫ్స్ సమాచారం అందించనున్నారు. కంపెనీ అత్యధిక ప్రాధాన్యాలకు అనుగుణంగా ప్రస్తుత ఉద్యోగులు ఉన్నారా అని తేల్చేందుకు పలు ఉత్పత్తి విభాగాల్లో కఠిన సమీక్ష జరిపామని ఉద్యోగులకు రాసిన లేఖలో సుందర్ పిచాయ్ తెలిపారు. మాస్ లేఆఫ్స్‌లో భాగంగా కంపెనీలో ఆరు శాతం ఉద్యోగులను విధుల నుంచి తప్పించారు. కొలువులు కోల్పోయిన ఉద్యోగులకు తగిన పరిహార ప్యాకేజ్ చెల్లిస్తామన్నారు. అమెరికా వెలుపల పనిచేసే గూగుల్ ఉద్యోగులు సైతం వారి కాంట్రాక్టులకు అనుగుణంగా బోనస్‌లు, హెల్త్‌కేర్ బెనిఫిట్స్ పొందుతారని కంపెనీ పేర్కొంది.