Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కోచ్‌ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని, కాచనపల్లి, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్ బాల్ కోచ్‌లను 2022-23 సంవత్సరానికి నియమించనుంది. ఈ పోస్టులకు ఎన్ఎస్ఎన్ఐఎస్ (NSNIS) డిప్లొమా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను tstribalwelfare.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తులను తమ రెజ్యూమెతో పాటు [email protected] మెయిల్ చేయాలని తెలిపింది. లేనిపక్షంలో అకడమిక్ సెల్, కమిషనర్ కార్యాలయం, గిరిజన సంక్షేమ శాఖ, డీఎస్ఎస్ భవన్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ నందు సమర్పించవచ్చని పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 30 చివరి తేదీగా నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం 9908550250, 9247267050 నెంబర్లకు సంప్రదించాలని సూచించింది.