Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరబాద్
ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వందలమంది ఫ్రెషర్లకు షాకిచ్చింది. అంతర్గత పరీక్ష తర్వాత పేలవమైన పనితీరు కారణంగా 800 మంది ఫ్రెషర్ ఉద్యోగులను తొలగించినట్లు బిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. అంతేకాదు ఉద్యోగుల శిక్షణ నిమిత్తం ఖర్చుపెట్టిన రూ.75,వేలను అభ్యర్థులు చెల్లించాల్సి ఉందని, అయితే దాన్ని మాఫీ చేస్తున్నట్టు వారికి పంపిన టెర్మినేషన్ లెటర్లో తెలిపింది. విప్రోలో పేలవమైన పనితీరుకారణంగా ఉద్యోగాలను కోల్పోయిన ఫ్రెషర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను తొలగించేందుకు ఇదొక సాకు మాత్రమే నని ఆరోపించారు.