Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ లో సీనియర్ నేత వీ హన్మంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో గాంధీ భవన్ నుంచి హన్మంతరావు బయటకు వచ్చేశారు.
క్రికెట్ టోర్నమెంట్‌కు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేను ఆహ్వానించేందుకు వీహెచ్ గాంధీభవన్‌కు వెళ్లారు. అయితే ఆ సమయంలో మహేష్ గౌడ్, వీహెచ్ మధ్య వాగ్వాదం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్‌కు ఠాక్రేను వీహెచ్ ఆహ్వానించగా 22వ తేదీన ఇన్‌ఛార్జి షెడ్యూల్ ఖాళీగా లేదని మహేష్ గౌడ్ బదులిచ్చారు. దీంతో ఇన్‌ఛార్జి వస్తానంటే నువ్వెందుకు అభ్యంతరం చెప్తున్నావంటూ వీహెచ్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.