Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సొంతగడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. నేడు న్యూజిలాండ్ తో రాయ్ పూర్ లో జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ ను 108 పరుగులకు కుప్పకూల్చిన భారత్... అనంతరం 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (51) అర్ధసెంచరీతో అలరించగా, తొలి వన్డే డబుల్ సెంచరీ హీరో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ 11 పరుగులు చేసి అవుటయ్యాడు. కివీస్ బౌలర్లలో షిప్లే 1, శాంట్నర్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక, ఇరుజట్ల మధ్య ఈ నెల 24న మూడో వన్డే జరగనుంది. నామమాత్రంగా మారిన ఈ వన్డేకు ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా నిలవనుంది.