Authorization
Fri May 16, 2025 03:47:18 pm
నవతెలంగాణ - ఆదిలాబాద్: ఆదివాసీల అతిపెద్ద జాతర కేస్లా పూర్ నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. జాతర కోసం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. నేడు నాగోబాను కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకోనున్నారు. అనంతరం ఆదివాసులతో అర్జున్ ముండా భేటీ కానున్నారు. ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో నాగోబా జాతరకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. శనివారం అర్ధరాత్రి నాగోబా జాతర ప్రారంభమైంది. వారం రోజుల పాటు జాతర జరుగనుంది. జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగానే కాకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు.