Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నుంచి మొదటి విడత జేఈఈ మెయిన్ ప్రారంభం కానుంది. మొత్తం 290 నగరాలు/పట్టణాలతో పాటు ఇతర దేశాల్లోని 18 నగరాల్లో ఆన్లైన్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 24, 25, 29, 30, 31 తేదీలతో పాటు ఫిబ్రవరి 1న బీటెక్‌లో ప్రవేశానికి పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ర్యాంకుతో ఎన్ఐటీల్లో చేరొచ్చు. బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్ష ఈ నెల 28వ తేదీన రెండో షిఫ్ట్(మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు) ఉంటుందని జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) ప్రకటించింది. ఈ నెల 24న పరీక్ష రాసేవారు హాల్‌టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మొదలయ్యే మెయిన్ చివరి విడతకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. రెండు విడతల్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసేవారి సంఖ్య లక్షన్నర వరకు ఉంటుంది. తెలుగు సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ చూపినవారిలో 2.50 లక్షల మంది మాత్రమే జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హులవుతారు.