Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిద్దిపేట: కొమురవెల్లి మళ్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి ఆదివారం ఆలయానికి భక్తజనం పోటెత్తింది. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి సుమారు 5నుండి 6 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యలు కలగకుండా ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.