Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అన్నమయ్య జిల్లా
తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ బాలిక ప్రసవించిన సంఘటన శనివారం వాల్మీకిపురంలో జరిగింది. స్థానికంగా ఉన్న ఓ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ బాలిక శనివారం సాయంత్రం కడుపునొప్పి తాళలేక ఇబ్బందులు పడుతుండటం చూసిన పాఠశాల సిబ్బంది బాలికను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీరా వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో బాలిక గర్భం దాల్చిందని తెలియడం, నిమిషాల వ్యవధిలోనే బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ బిందుమాధవి, తహసీల్దార్ ఫిరోజ్ఖాన్లు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలికను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ సంఘటన పట్టణంలో చర్చనీయంగా మారింది. ఈ విషయంలో కలెక్టర్ గిరీషా సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు పరుగులు తీస్తూ విచారణ చేపట్టారు. గర్భవతిగా మారడానికి కారణం బాలిక మేనమామ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.