Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిత్తూరు
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని వంతెన వద్ద శనివారం వాహనదారులు, స్థానికుల అప్రమత్తతతో ఓ వృద్ధుడి ప్రాణాలు నిలిచాయి. చిత్తూరు నుంచి అరగొండ వెళ్లే పల్లె వెలుగు బస్సు బస్టాండు నుంచి బయటకు వస్తుండగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో డ్రైవర్ బస్సును ఆపారు. అదే సమయంలో జీడీ నెల్లూరు మండలం బాలగంగనపల్లికి చెందిన వృద్ధుడు హుస్సేన్ బస్సు ఆగిందని రోడ్డు దాటే ప్రయత్నం చేశారు.
ఈ తరుణంలో వాహనాలు కదలడంతో వృద్ధుణ్ని గమనించకుండా డ్రైవర్ బస్సును కదిలించారు. వాహనం ఢీకొట్టడంతో అక్కడే కిందపడి వాహనం కిందకు వెళ్లిపోయారు. కొద్దిదూరం ఆయనను బస్సు ఈడ్చుకెళ్లింది. వాహనదారులు, స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపేశారు. నిర్ఘాంతపోయిన వృద్ధుణ్ని స్థానికులు బయటకు తీశారు. ప్రమాదంలో ఆయన కాలికి గాయం కావటంతో ఆస్పత్రికి తరలించారు.