Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నిజాం వారసుడిగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ జా ఎంపికయ్యారు. ప్రిన్స్ ముకర్రమ్ జా మృతి అనంతరం ఆయన వారసుడిగా అజ్మత్ జాను ఎంపిక చేశామని కుటుంబసభ్యులు తెలిపారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం టస్ట్రీల మధ్య సంప్రదాయ పద్ధతిలో ఈ ప్రక్రియను నిర్వహించామని చౌమహల్లా ప్యాలెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
1960లో జన్మించిన అజ్మత్ జా లండన్లోనే ప్రాథమిక, ఉన్నత చదువులు చదివారు. ఫొటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఫొటోగ్రఫీ పట్టా పొందారు. హాలీవుడ్లో కొన్ని సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ విధులు నిర్వహించారు. హాలీవుడ్ దిగ్గజాలు స్టీవెన్ స్పీల్బర్గ్, రిచర్డ్ అటెన్బరోలతో కలిసి పనిచేశారు. పలు లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. తండ్రి ముకర్రమ్ జా అంత్యక్రియల పూర్తికి వారం రోజుల కిందట హైదరాబాద్ వచ్చిన ఆయన ప్రస్తుతం పాతబస్తీలోని తన పూర్వీకుల నివాసంలో ఉంటున్నారు.