Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు వస్తున్న టీచర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఉదయం నుంచే సైఫాబాద్ ఠాణా పరిధిలోని కూడళ్లలో మోహరించిన పోలీసులు ఒకరిద్దరు కనిపించినా అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ పెద్దసంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్న ఉపాధ్యాయులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించారు. పిల్లలతో వచ్చిన తల్లులనూ వదల్లేదు. టీఆర్టీయూ నేత, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి ఉపాధ్యాయులకు మద్దతుగా అక్కడికి చేరుకోగా ఆయన్నీ అరెస్టు చేశారు.
అనంతరం పిల్లలను తల్లులకు అప్పగించారు. 25మంది చిన్నారులతో అందరినీ వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉపాధ్యాయ దంపతులు మాట్లాడుతూ 19 జిల్లాల్లోని దంపతులను బదిలీలు చేసి 13 జిల్లాల్లో నిలిపివేయడంతో 2,100మంది బాధితులుగా మారారన్నారు. తమ ఆవేదనను మన్నించి న్యాయం చేయాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని తెలిపారు.