Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులోపడి ఓ బాలిక కన్న తండ్రిపై దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉన్నది. ఆమెకు ఐటీఐ చదువుతున్న ఓ బాలుడితో పరిచయమైంది. రోజులు గుడుస్తున్న కొద్ది అదికాస్త ప్రేమగా మారింది. అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె.. తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. అయితే విషయం కాస్తా తండ్రి చెవిన పడటంతో.. ఆమెను నిలదీశాడు. క్రమంగా అది గొడవకు దారితీయడంతో కిచెన్లో ఉన్న చాకు తీసుకుని తండ్రి మెడపై పొడవడానికి ప్రయత్నించింది. అయితే అతడు తప్పుకోవడంతో అది వీపునకు గుచ్చుకున్నది. కాగా, తండ్రి ఫిర్యాదులో బాలికను అరెస్టు చేసిన పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తుప్రారంభించారు.