Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రైలులో గంజాయి రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకుని అతడి నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేకున్నారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేవశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను కేసు వివరాల వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా ఈక గ్రామానికి చెందిన శైలేంద్ర కుమార్(33) కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 21న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాం నెంబరు-1లో 20 కిలోల గంజాయి బ్యాగులతో నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో సికింద్రాబాద్ రైల్వే ఎస్సీ అనురాధ ఆదేశాల మేరకు జీఆర్పీ ఎస్ఐ మాజీద్‌తో పాటు క్రైమ్ పోలీసులు శ్రీనివాస్, వెంకటేశ్వర్, సత్యనారాయణసింగ్, ఆర్పీఎఫ్ సీఐ నర్సింహ, ఎస్సైలు సుబ్బారావు, ప్రసాద్ తనిఖీలు చేస్తుండగా శైలేంద్ర కుమార్ కనిపించాడు. బ్యాగులో ఏమున్నాయని పోలీసులు ప్రశ్నించగా తడబడుతూ సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులు అనుమానంతో బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు. ఈనెల 19న విశాఖపట్నం ఫారెస్ట్ ఏరియాలో ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి కిలో రూ.1000 చొప్పన పది ప్యాకెట్లను కొనుగోలు చేసినట్టు తెలిపారు. మథురైలో కిలోకు రెండు వేలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.