Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తల్లిదండ్రులు అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నా డు. సికింద్రాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ వివరాల ప్రకారం... బొల్లా రం డౌటన్ బజార్‌కు చెందిన సుభాష్ కుమారుడు కె.సతీష్ (20) ఇంటర్ చదువుతున్నాడు. అతడు కొద్ది రోజులుగా కాలేజీ వెళ్లడంలేదు. ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాలేజీకి ఎందుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు సతీ్‌షను మందలించగా డబ్బులు కావాలని అడిగాడు. వారు కొంత డబ్బు ఇవ్వగా, అడిగినంత ఇవ్వలేదని మనస్థాపం చెందాడు. శనివారం అల్వాల్ - బొల్లారం రైల్వే స్టేషన్ మార్గమధ్యలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటన స్థలానికి వచ్చి మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్టు తెలిపారు.