Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బ్రెజిల్
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు రాజధాని బ్రసిలియాలో సృష్టించిన అల్లర్లపై అధ్యక్షుడు లూలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ తరుణంలోనే దేశ ఆర్మీ చీఫ్ జనరల్ జూలియో సిజర్ డె అర్రుడాను పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసినట్లు ఆ దేశ సైన్యం అధికారిక వెబ్సైట్ తెలిపింది. జూలియో స్థానంలో జనరల్ టొమస్ మిగ్యూల్ రెబెరో పైవాను నియమించినట్లు తెలియజేసింది. సైన్యంలోని కీలక వ్యక్తులే అల్లరి మూకలను రాజధానిలోకి అనుమతించారన్న ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకొన్నారు.