Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలోని నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ మాల్ కూల్చివేతకు అధికారులు రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. పక్క భవనాలకు డ్యామేజ్ జరగకుండా డెక్కన్ మాల్ కూల్చివేతకు అధికారుల చర్యలు చేపడుతున్నారు. మాల్ లోపల 10 వేల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. కొంత వరకు క్రేన్ల సాయంతో ముందు భాగం నుంచి వ్యర్థాలను తొలగించారు. కాగా మాల్ లోపల చిక్కుకున్న ఇద్దరి మృత దేహాలు లభ్యమైన తరువాతనే భవనం కూల్చివేత చర్యలు చేపట్టనున్నారు. భవనం కూల్చివేత ఖర్చులను జీహెచ్ఎంసీ అధికారులు యాజమానుల నుంచి వసూలు చేయనున్నారు. కటింగ్ మెషీన్ల ద్వారా స్లాబ్ భాగాలను కూల్చి వేయనున్నారు. ఫైర్ యాక్సిడెంట్ నేపథ్యంలో భవన యజమానికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మంటల ధాటికి భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చి వేస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు నోటీసులు పంపించారు. కాగా నాల్గవ రోజు అవుతున్నా... భవనం ఇంకా చల్లబడలేదు. లోపల కాలిన వస్తువుల నుండి పొగ వస్తోంది. ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మరొకసారి వాటర్ కొట్టారు. భవనం చల్లబడితే తప్ప లోపల ఉన్న బూడిద వ్యర్దాలు బయటకి తీయలేని పరిస్థితి ఉంది. నిన్న ఫోమ్ ఉపయోగించిన ఫైర్ సిబ్బంది.. ఈరోజు మరొకసారి ఫోమ్ ఉపయోగించే అవకాశం ఉంది.