Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - డెహ్రాడూన్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరగఢ్లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఇవాళ ఉదయం 8.58 గంటలకు సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ‘ఆదివారం ఉదయం 8.58 గంటలకు ఉత్తరాంఖండ్లోని ఫితోరగఢ్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైంది. సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించాం’ అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. కాగా, ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తినష్టంగానీ, ప్రాణనష్టంగానీ జరగలేదని అధికారులు తెలిపారు.