Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌కుమార్ రెడ్డి హంగామా సృష్టించాడు. అర్థరాత్రి వేళ మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లో చొరబడ్డాడు. ఆమె పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఎవరు నువ్వు..? ఎందుకొచ్చావు..? అని గట్టిగా ప్రశ్నించి సీరియస్ అవ్వడంతో డ్యూటీ విషయంలో మాట్లాడేందుకు వచ్చానని చెప్పాడు. దీంతో మహిళా ఐఏఎస్ కేకలు వేయడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది .. డిప్యూటీ తహసీల్దార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆనంద్‌కుమార్ రెడ్డితో పాటు అతని డ్రైవర్‌ను కూడా భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. వారిపై సెక్షన్ 458r/w34 కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై స్పందించిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. రాత్రి నాకు ఊహించని సంఘటన ఎదురైంది. అత్యంత బాధాకరమైన ఘటన జరిగింది.. రాత్రి నా ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు.. అప్రమత్తతో నా ప్రాణాలు కాపాడుకున్న.. మీ ఇంటికి తాళాలు వేసుకోండి... తలుపు తాళాలను తనిఖీ చేసుకోండి.. అత్యవసర పరిస్థితిలో డయల్ 100కు కాల్ చేయండి అంటూ పోస్టు పెట్టారు.