Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రానున్న ఎన్నికలకు సంబంధించి జనసేన నాయకుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి తమ అధినేత పవన్ కల్యాణ్ తీసుకోబోయే నిర్ణయం గురించి తామంతా ఎదురు చూస్తున్నామని చెప్పారు. పొత్తుల గురించి, సీట్ల షేరింగ్ గురించి పవన్ ప్రకటిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని అరాచక పాలనను అంతమొందించడానికి ఇతర పార్టీలతో పొత్తులు అవసరమని చెప్పారు. సినీ పరిశ్రమలో ఉన్న ఏ ఒక్క వ్యక్తిని కూడా ఒక్క మాట అనని వ్యక్తులు కేవలం రాజకీయ లబ్ధి కోసం తమ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ పరోక్షంగా మంత్రి రోజాపై విమర్శలు గుప్పించారు. మరోవైపు, రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.