Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : క్యూబా సంఘీభావ సభలో ప్రపంచ విప్లవ యోధుడు చే గువేర కూతురు డాక్టర్ అలైదా గువేరా ఉపన్యాస సారంశం..
25 సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారి భారతదేశానికి వచ్చినప్పుడు మీరందరూ నా మీద చూపించిన ఆప్యాయతను ఎప్పటికీ మరవలేను. నేను వేర్వేరు రాష్ట్రాలను సందర్శించినప్పుడు నాకు ప్రజల ఆదరణ ఎల్లప్పుడూ లభించింది. మొదటగా ఒక సామాన్య క్యూబా వనితగా చే గువేరా కూతురుగా వాళ్ళ ఆప్యాయతను నాకు పంచారు. చెప్పుకోవడానికి కొన్ని వేల సందర్భాలు, అందులో చాలా వరకు సరదా సన్నివేశాలే వున్నాయి. ఉదాహరణకు మొట్ట మొదటిసారిగా ఒక కేరళ గుడికి చెందిన ఒక పెద్ద ఏనుగు మీద కూర్చోవడం. అది అద్భుతమైన 15 నిమిషాలు.
నిజం చెప్పాలంటే, నేను వీలైనంత త్వరగా ఆనాటి మధుర జ్ఞాపకాలను గ్రంధస్తం చేయాలి. ఎందుకుంటే కాలం వాటిలో కొన్నింటిని చెరిపేస్తూ ఉంది. నేను పొందిన ఈ సంఘీభావంతో కూడిన ఆఫ్యాయతను, పదిలపర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
మరొక్కసారి మీ మధ్యలో ఉన్నాను. కానీ అప్పటికంటే ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయాను. కాలం ఎవరినీ, దేన్నీ వదిలిపెట్టదు కదా! కానీ ఇప్పటికీ, ఒక మెరుగైన ప్రపంచం మానవాళికందరికీ అవసరం అనే నా నమ్మకంపై ధృడంగా ఉన్నాను. ఎందుకంటే దురదృష్టవశాత్తు మనం జీవన నైతికతను (ఎథిక్స్ ఆఫ్ లివింగ్) కోల్పోతున్నాము. అందువలన మన మనుగడ హక్కును కోల్పోతున్నాము. యుద్ధాలు మరియు మహమ్మారీల మధ్య మన సహజ ఆవాసాలను కోల్పోతున్నాము. అంతకంటే దారుణం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనలో చాలా మందిలో ఉన్నది ఉదాసీనత.
ప్రత్యేకంగా క్యూబా విషయంలో, ఈ మధ్య కాలంలో మహమ్మారి వలన మాకు కావాల్సిన ఆర్థికాభివృద్ధి చాలా పెద్ద మొత్తంగా దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా ప్రపంచంలాగే మేము, విప్లవ మొదటివాళ్ళనుంచి అనుభవిస్తున్న ఆర్థిక మరియు ఫైనాన్స్ ఆంక్షలను మరింత తీవ్రతరం అయ్యాయి.
అమెరికా ప్రభుత్వం తన చట్టాలను ఖండాంతర స్వభావంలో రూపొందించారు. వీటిలో అది క్యూబా ఇతర ప్రపంచ ప్రజలతోటి నివారించాలని చూస్తోంది. ఈ తంతుని ఒక సులభ ఉదాహరణలో అర్థం చేసుకుందాం.
క్యూబాకు దానికి ఉన్న అందమైన బీచ్లు మరియు పర్యాటకుల భద్రత వల్ల పర్యాటక రంగంలో మంచి అభివృద్ధి ఉంది. కానీ మాకు మా పర్యాటక రంగ అభివృద్ధికి కావాల్సిన విమానాలు మా వద్ద లేవు. కాబట్టి మేముకావాల్సిన విమానాలను అడ్డెకు తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు జరిగింది? మరి అమెరికా ఏసుంటుందంటే ఒక వేళ 10 శాతం వరకు అమెరికా విడి భాగాలు ఈ విమానాల్లో ఉంటే, ఈ వాణి మార్చిడిని నిషేధించడం వాళ్ళ హక్కుగా భావిస్తున్నారు. మరియు ఒకవేళ ఏదైనా కంపెనీ ఈ వాణిజ్యానికి ధైర్యం చేస్తే వాళ్ళ మీద మిలియన్ల డాలర్లు ఫైన్ గా వేసే శక్తి కలిగిఉంది. లేకపోతే ఈ కంపెనీలను అమెరికా మార్కెట్లో వాళ్ల వస్తువులను అమ్ముకోకుండా చేస్తామని బెదిరిస్తుంది. దీనివల్ల మేము మాకు అవసరమైన వస్తువులను సమకూర్చుకోలేకపోతున్నాము. ఇంకా చెప్పాలంటే తిండి మరియు మందుల విషయంలోను ఇదే పరిస్థితి. దీని వలన మేము ఎలీఐ కళ్ళుగప్పి ముగ్గురు లేక ఎక్కువ మంది మధ్యవర్తులకు ఎక్కువ మోతాదులో డబ్బు చెల్లించి మా ప్రజలకు కావాల్సిన సామాన్య నిత్యావసర వస్తువులను సమకూర్చుకోవాల్సి వస్తుంది.
దీనంతటిని బట్టిచూస్తే, ఈ కూరమైన మరియు అమానవీయ ఆంక్షలను అంతమొందించడానికి అంతర్జాతీయ సంఘీభావ అవసరాన్ని సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా ఇలా ఉన్నప్పటికీ, క్యూబా ప్రజలు వాళ్ళ జీవితాలను మరియు వాళ్ళ సమాజ పరిపూర్ణతను కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్త ఫ్యామిలీ కోడు, మానవ సంభందాలను మెరుగుపర్చడానికి చిన్న పిల్లలు మరియు వృద్ధుల హామి కొరకు క్యూబా మహిళల ఇంటిగ్రిటీ హామిని కొనసాగించడానికి, సామ్యవాద సమాజాన్ని మెరుగుపర్చే విధంగా కొత్త తరాలకు విలువల శిక్షణను ఇవ్వడానికి ఆమోదించారు.
ఈ ఆంక్షలన్నీ ఉన్నప్పటికీ, వేల డాక్టర్లను ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాలకు పంపించడం. ద్వారా మరియు ఈ మహమ్మారి కాలంలో ఇటలీ మరియు స్పెయిన్ దేశాలకు వారి కోవిడ్ యుద్ధంలో సహాయం చేయడానికి వైద్య నిపుణుల బృందాలను పంపించడం ద్వారా, ఇంకా ఇలాంటి మరెన్నో చర్యల ద్వారా మేము మా. సంఘీభావాన్ని ప్రపంచ ప్రజలందరితో కొనసాగిస్తున్నాము. ప్రపంచంలోనే ఆర్థికంగా మరియు మిలటరీ పరంగా అత్యంత శక్తివంతమైన దేశంతో ఎదురింపబడి మరియు మారణహోమానికి దారితీసే ఆందోళకు గురికాబడిన ఒక చిన్న దేశం తన దేశ ప్రజలను మరియు ఇతర ప్రపంచ దేశాల ప్రజలను కోవిడ్ నుండి కాపాడుకోవడానికి కావాల్సిన దాంట్లో 5 శాతం వ్యాక్సిన్లను తయారు చేసుకుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆంక్షలే లేకపోతే ఏమీ చేయగలిగేదో!
మనం నివసించే ఈ ప్రపంచంలో ఎన్నో పోరులు ఉన్నాయని నాకు తెలుసు. అవసరాలు మరియు కొరతల గురించి తెలుసు, కానీ నేను ఎటువంటి భయం లేకుండా ఒక్కమాట చెప్పగలను. అది ఏంటంటే సంఘీభావం అనేది ఒక అత్యంత ఆప్యాయతతో కూడిన ప్రజల భావన మరియు దాన్ని పుచ్చుకునేవారు ఎల్లప్పుడూ కృతజ్ఞతలో ఉంటాడు. ఎందుకంటే అది వాళ్ల అవసరం. కాని దాన్ని అందించేవాడు ఒక మనిషిగా ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. మరియు ఒక మనిషిగా, ఒక వనితగా అత్యున్నత దశను చేరుకుంటాడు. మన మధ్యలో ఎంతో భౌగోళిక దూరం ఉన్నప్పటికినీ మాకు అవసరం ఉన్నప్పుడు మీరు మా పక్షాన నిలబడినందుకు మీకు మా ప్రజలందరి తరపున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా 'తరఫున ధన్యవాదములు మరి మనము ప్రతి ఒక్కరి కోసం ఒక న్యాయవంతమైన ప్రపంచ నిర్మాణంలో కలిసి నడుస్తామని నా హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఎల్లప్పుడూ విజయం కోసం ముందుకు.