Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచ విప్లవ యోధుడు చేగువేరాకు రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది. హైదరాబాద్ రవీంధ్రభారతిలో ఏర్పాటు చేసిన క్యూబా సంఘీభావ సభకు చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా హాజరయ్యారు. వారికి వామపక్షనేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అలైదా గువేరా మాట్లాడుతూ.. చేగువేరాను టీ షర్టులు, ఫొటోలకు పరిమితం చేయొద్దని, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. క్యూబాలో విద్య, వైద్యం ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చేగువేరా సేవలను గుర్తు చేసుకున్నారు. సామ్రాజ్యవాద శక్తులపై పోరాడాలంటూ వామపక్షనేతలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ, ప్రజాకవి గోరటి వెంకన్న.. చేగువేరాపై ఆలపించిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి.