Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ తొలి విడత పరీక్షలు మంగళవారం(జనవరి 24) ప్రారంభం కానున్నాయి. శనివారం మొదటి రోజు పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేయగా, ఆదివారం రెండో పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) విడుదల చేసింది. మిగిలిన తేదీల్లో పరీక్షల అడ్మిట్ కార్డులను సోమవారం నుంచి విడుదల చేయనున్నట్లు ఎన్టిఎ తెలిపింది.
బిఇ,బి.టెక్ విభాగాల్లో జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్ష (పేపర్ 1, రెండు షిఫ్టుల్లో) ఈ నెల 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. అలాగే, ఈ నెల 28న బి.ఆర్క్, బి.ప్లానింగ్ విభాగంలో పేపర్ -2ఎ, 2బి పరీక్ష మధ్యాహ్నం షిఫ్ట్ జరుగుతుందని పేర్కొంది. 24,25 తేదీలలో పరీక్ష జరిగిన అనంతరం మూడు రోజుల తర్వాత పరీక్షల జరగనుంది. దేశవ్యాప్తంగా మొత్తంగా 290 నగరాల్లో, దేశం వెలుపలి 25 నగరాల్లో జెఇఇ మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎన్టిఎ స్పష్టం చేసింది.