Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ నేపథ్యంలో విదేశీ పర్యాటకులను ఆకర్షించే కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రామప్ప దేవాలయానికి యునెసో గుర్తింపు లభించడంతోపాటు పోచంపల్లి గ్రామం బెస్ట్ టూరిజం విల్లేజ్ ఎంపిక కావడంతో తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని ఆయన చెప్పారు. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం మార్ట్‌లో వివిధ దేశాల పర్యాటక శాఖలు ఏర్పాటు చేసిన టూరిజం ఇన్ఫర్మేషన్ స్టాల్స్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి ఉ సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమన్నారు. చరిత్ర, వారసత్వ సంపద, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు, సెలయేర్లు, దేవాలయాలు, వైల్డ్ టూరిజం, ఎకో టూరిజం, ట్రైబల్ టూరిజం, ట్రైబల్ సంసృతి, మెడికల్ టూరిజం, బతుకమ్మ పండుగ గొప్పదనం లాంటి ఎన్నో ప్రత్యేకతలు తెలంగాణలో ఉన్నాయని, అలాగే ఏ దేశంలో లేని ప్రత్యేకతలు తెలంగాణ సొంతమని చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాల ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.