Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సొంతగడ్డపై జరుగుతున్న హాకీ వరల్డ్ కప్ లో భారత్ క్వార్టర్ ఫైనల్స్ చేరడంలో విఫలమైంది. న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. నిర్ణీత సమయానికి స్కోరు 3-3తో సమం కాగా, పెనాల్టీ షూటవుట్ నిర్వహించారు. పెనాల్టీ షూటవుట్ లో భారత్ 4-5 తేడాతో పరాజయం చవిచూసింది. షూటవుట్లో షంషేర్ సింగ్, సుఖ్ జీత్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, అభిషేక్ గోల్స్ మిస్ చేయడం భారత్ కు ప్రతికూలంగా మారింది. ఇక భారత్ వర్గీకరణ మ్యాచ్ లో జపాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ జనవరి 26న జరగనుంది.